Header Banner

ట్రంప్‌ దెబ్బకు దిగొచ్చిన చైనా.. భారత్ వైపు చూపు! ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో భారీ వృద్ధికి..

  Thu Apr 03, 2025 20:40        U S A

అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, అమెరికా సుంకాల భారం చైనాపై ఎక్కువగా పడుతోంది. దీనివల్ల భారతీయ ఎగుమతులకు కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. చైనాపై అమెరికా సుంకాలు 65% లేదా అంతకంటే ఎక్కువ ఉండగా, భారత్‌పై సుంకాలు 27% మాత్రమే ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మరింత గిరాకీ లభిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్కెట్ వర్గాల ప్రకారం... ముఖ్యంగా సాంకేతిక ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, రత్నాలు, ఆభరణాలు, వస్త్రాలు వంటి రంగాల్లో భారత్ దూసుకుపోయే అవకాశం ఉంది. ఈ విషయంపై ఈవై ఇండియా ట్రేడ్ పాలసీ లీడర్ అగ్నేశ్వర్ సేన్ మాట్లాడుతూ, ఇతర ప్రాంతీయ ఎగుమతిదారులపై తీవ్ర ప్రభావం చూపే రంగాలలో భారతదేశానికి పోటీతత్వం పెరిగే అవకాశం ఉంది అన్నారు. అంతేకాకుండా, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సప్లై చెయిన్ వ్యవస్థలను పునర్నిర్మించాలని, ఆసియాలోని ఎఫ్ టీఏ భాగస్వాములతో సహకరించాలని సూచించారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ 10 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది.

 

ఇది కూడా చదవండి: అన్నంత పని చేసిన ట్రంప్.. భారత్‌పై ప్రతీకార సుంకాలు షురూ.. ఎంతో తెలుసా.?

 

రాబోయే సంవత్సరాల్లో పాలసీ మద్దతు, అనుకూల పన్ను విధానం ఉంటే ఈ సంఖ్య 100 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఐసీఈఏ అంచనా వేసింది. భారత్, అమెరికా మధ్య సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే, భారత ఎలక్ట్రానిక్స్ వాణిజ్యం మరింత వృద్ధి చెందుతుందని ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మొహింద్రూ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తక్కువ ధర కలిగిన కార్ల విభాగంలో భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగం అమెరికా మార్కెట్‌లో ఎక్కువ వాటాను పొందే అవకాశం ఉందని ఈవై ఇండియా పార్టనర్ సౌరభ్ అగర్వాల్ అన్నారు. 2023లో చైనా ఆటో మొబైల్, విడిభాగాల ఎగుమతులు 17.99 బిలియన్ డాలర్లుగా ఉండగా, భారత్ ఎగుమతులు 2.1 బిలియన్ డాలర్లు మాత్రమే. ఈ వ్యత్యాసాన్ని అధిగమించడానికి ప్రభుత్వం పీఎల్ఐ పథకాన్ని మరింత మెరుగుపరచాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా సుంకాల నేపథ్యంలో చైనాకు ఎదురుదెబ్బ తగలడం, భారత్‌కు కలిసిరావడం అనేది ఆర్థికంగా ఒక ముఖ్య పరిణామం అని... దీనిని సద్వినియోగం చేసుకుంటే, భారతీయ ఎగుమతులు కొత్త శిఖరాలను అధిరోహించగలవని నిపుణులు పేర్కొన్నారు. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Trump #Tariffs #IndiaModi #Modi #Trumpmeet #PLIScheme #FTA #SupplyChain